Medak Bus Accident | మెదక్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ధాన్యం లారీ ఢీ..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Medak Bus Accident | జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా(medak) కొల్చారం వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Medak Bus Accident | హైదరాబాద్​ నుంచి వస్తున్న బస్సు..

హైదరాబాద్ నుంచి మెదక్, ఎల్లారెడ్డి (Yellareddy) మీదుగా బోధన్‌కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (RTC Super Luxury), ధాన్యం లోడ్​తో వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ఎల్లారెడ్డి, బాన్సువాడ (Banswada), బోధన్, మెదక్​కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే కొల్చారం పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా మెరుగైన చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Medak Bus Accident | నిద్రమత్తా.. అతివేగమా..?

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Petrol Price Hike | త్వరలో పెట్రోలు ధరలు పెరుగుతాయి : రాహుల్​ గాంధీ

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *