అక్షరటుడే, కామారెడ్డి: Toddy Workers | కల్లుగీత వృత్తి రక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఆగస్టు 2 నుంచి 18 వరకు చేపట్టనున్న చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్ కోరారు. మంగళవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో చైతన్య యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
Toddy Workers | హామీలను నెరవేర్చాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 50ఏళ్లు పూర్తి చేసుకున్న గౌడ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గీత కార్మికుల సమస్యలను ప్రజలకు తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశమని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర ఆగస్టు 12న ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చేరుకుంటుందని, అక్కడి నుంచి బైక్ ర్యాలీగా కామారెడ్డికి వచ్చి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభను గౌడ సంఘ సభ్యులంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, నారాగౌడ్, సాయాగౌడ్, రాజాగౌడ్, శంకర్ గౌడ్, సత్యాగౌడ్, రామాగౌడ్, రాజేందర్ గౌడ్, జీవన్ గౌడ్, రమేష్ గౌడ్, దేవాగౌడ్, అంజాగౌడ్, బస్వగౌడ్, మోహన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Health Screening | పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య