అక్షరటుడే, వెబ్డెస్క్: BRICS Declaration | ఢిల్లీ (Delhi)లోని భారత్ మండలంలో బ్రిక్స్ సమ్మిట్ శనివారం మధ్యాహ్నం ప్రారంభం అయింది. తొలి రోజు 11 సభ్య దేశాధినేతల సమావేశం నిర్వహించారు.
బ్రిక్స్ సదస్సు తొలిరోజు భారత్ కీలక విజయం సాధించింది. అన్ని సభ్య దేశాలను ఒక ఉమ్మడి ప్రకటనకు అంగీకరించేలా చేసింది. బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో, ఈ కూటమి ఒక ఉమ్మడి ప్రకటనకు అంగీకరించడం ఒక కీలక పరిణామం. శనివారం సాయంత్రం 4 గంటలకు ‘బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్’ వెలువడే అవకాశం ఉంది.
BRICS Declaration | ఉద్రిక్తతల వేళ..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ‘బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఏ దేశం పేరునూ ప్రస్తావించకుండానే అన్ని రకాల దురాక్రమణ చర్యలను ఖండించనుంది. సంఘర్షణలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గం అని ఈ ప్రకటన నొక్కి చెబుతుంది. పశ్చిమాసియా పరిస్థితులపై వాడే పదజాలం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండటంతో, నాయకుల ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించేందుకు బ్రిక్స్ షెర్పాలు సదస్సుకు ముందు రోజులు తరబడి తీవ్రంగా శ్రమించారు. భారత్కు సన్నిహిత మిత్రదేశాలైన ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య ఉన్న విభేదాలే ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం కుదరకపోవడానికి ప్రధాన కారణం.
ఇది కూడా చదవండి..: Prajwal Revanna Jail | జైలులో మాజీ ఎంపీ ఉపయోగించిన ఫోన్లో పోర్న్ వీడియోలు