Ganapati Celebrations | సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Ganapati Celebrations | సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. శ్రీ ధన్​పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం నగరంలోని మార్వాడిగల్లీలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చందాలను రాశారు.

Ganapati Celebrations | ప్రతి ఏడాది ట్రస్ట్​ ఆధ్వర్యంలో సహకారం

ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రతి ఏడాది తమ ట్రస్టు ద్వారా గణేశ్​ మండపాలకు సహకారం అందిస్తామని తెలిపారు. గత ఏడాది 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ ఏడాది కూడా సుమారు 800 మండపాలకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని సంస్కృతి సనాతన ధర్మం ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు తమ మండపాల ముందు బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ఉంచాలని సూచించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కిసాన్ షాపింగ్ మాల్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Power Cuts | కర్షకుల కన్నెర్ర.. కరెంట్ కోతలపై ట్రాన్స్​కో ఎస్ఈ ఆఫీస్​ ముట్టడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *