అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sepsis Awareness | ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయవద్దని.. సెప్సిస్‌పై అప్రమత్తతే ప్రాణరక్షణ అని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. 13న ప్రపంచ సెప్సిస్ దినోత్సవం సందర్భంగా ఎల్లమ్మ గుట్టలోని మెడికవర్ హాస్పటల్ (Medicover Hospital)లో వైద్యులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sepsis Awareness | అవగాహన ఉండడం అత్యవసరం..
ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ విభాగం వైద్యుడు రమేష్ బొల్లిశెట్టి మాట్లాడుతూ.. సెప్సిస్, తీవ్రమైన ఇన్ఫెక్షన్లపై అవగాహన పెంచడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. శరీరంలో ఏర్పడే ఒక చిన్న ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమైన పరిస్థితిగా మారడమే ‘సెప్సిస్’ అని తెలియజేశారు. దీనికి సకాలంలో సరైన చికిత్స అందించకపోతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. “సెప్సిస్ అనేది శరీరంలో ఇన్ఫెక్షన్‌కు నిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రతిస్పందించినప్పుడు ఏర్పడే ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి. ప్రతి నిమిషం ఇందులో చాలా విలువైనది. తీవ్రమైన జ్వరం, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు రక్తపోటు తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణాలు. మెడికవర్ హాస్పిటల్స్‌లోని మా క్రిటికల్ కేర్ విభాగం (ICU) అత్యంత అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కంటికి రెప్పలా కనిపెట్టే మానిటరింగ్ ద్వారా రోగికి వేగవంతమైన ఆర్గాన్ సపోర్ట్ అందిస్తుందని వివరించారు.
Sepsis Awareness | రక్తపోటు.. శ్వాసక్రియ దెబ్బతింటాయి..
అనస్థీషియాలజీ విభాగం వైద్యులు వేణు, నాగరాజు (Consultants in Anaesthesiology) మాట్లాడుతూ.. సెప్సిస్ తీవ్ర రూపం దాల్చినప్పుడు రోగి రక్తపోటు మరియు శ్వాసక్రియ దెబ్బతింటుందన్నారు. అలాంటి సమయాల్లో అడ్వాన్స్‌డ్ ఎయిర్‌వే మేనేజ్‌మెంట్, విఐపి విజిలెన్స్, శరీరంలో కీలక అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా నిరంతరం జరిగేలా చూడటంలో అనస్థీషియాలజీ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు ఫణి కృష్ణ, రాహుల్ (Emergency Physicians) మాట్లాడుతూ.. సెప్సిస్ చికిత్సలో ‘గోల్డెన్ అవర్’ (మొదటి గంట) అత్యంత కీలకమైనదన్నారు. రోగి ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు రాగానే ప్రాథమిక లక్షణాలను గుర్తించి, వేగవంతంగా బ్లడ్ కల్చర్స్, యాంటీబయోటిక్స్ ప్రారంభించడం ద్వారా ప్రాణాపాయాన్ని అధిగమించవచ్చన్నారు.
Sepsis Awareness | మెడికవర్ హాస్పిటల్స్‌లో మల్టీడిసిప్లినరీ విధానం ప్రత్యేకత
సెప్సిస్ చికిత్స కేవలం ఒకే రంగానికి చెందిన వైద్యులతో సాధ్యపడదని.. మెడికవర్ హాస్పిటల్స్‌లో క్రిటికల్ కేర్ నిపుణులు, ఎమర్జెన్సీ ఫిజిషియన్లు, అనస్థీషియాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ నిపుణులు అందరూ కలిసి సమగ్రమైన ‘మల్టీడిసిప్లినరీ బృందం’గా పనిచేస్తారని వైద్యులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Ganapati Celebrations | సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలి..: ఎమ్మెల్యే ధన్పాల్