TTD Bhanu Prakash Reddy | మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం: టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి

మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు.

Naresh Chandan

అక్షరటుడే, తిరుపతి: TTD Bhanu Prakash Reddy | వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర” కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి మట్టి గణపతులను తయారు చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

TTD Bhanu Prakash Reddy | చిన్నారుల చేతులతో మట్టి గణపతులు

పర్యావరణంపై అవగాహన పెంచేందుకు గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో చిన్నారుల చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కేవలం 4 సంవత్సరాల చిన్నారి కూడా ఎంతో ముచ్చటగా మట్టి గణపతిని రూపొందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

akshara today .jpg bhanu 3

TTD Bhanu Prakash Reddy | ప్రతిభకు గుర్తింపు – ప్రోత్సాహం

మట్టి ప్రతిమలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన పిల్లలకు మొదటి, రెండో, మూడో బహుమతులతో పాటు, కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు.

MLC Bharat Remarks | ఎమ్‌ఎల్‌సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్.. చట్టాన్ని అతిక్రమిస్తే ఉక్కుపాదమే!

TTD Bhanu Prakash Reddy | మహానగరాల తరహాలో తిరుపతిలో వేడుకలు:

ముంబయి, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏ విధంగానైతే వినాయక నవరాత్రులు, నిమజ్జన వేడుకలు వైభవంగా జరుగుతాయో.. అదే స్థాయిలో తిరుపతిలోనూ సామూహిక నిమజ్జన కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నామని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు.

TTD Bhanu Prakash Reddy | పర్యావరణ పరిరక్షణ మన నైతిక బాధ్యత:

సృష్టికి మూలమైన ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి నైతిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు.

చివరగా, ప్రజలకు, భక్తులకు భానుప్రకాశ్ రెడ్డి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

akshara today .jpgbhanu 2

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *