ఆంధ్రప్రదేశ్​Amaravati Land Acquisition | అమరావతిలో పుంజుకున్న‌ భూసేకరణ.. మరిన్ని గ్రామాలకు నోటిఫికేషన్

Amaravati Land Acquisition | అమరావతిలో పుంజుకున్న‌ భూసేకరణ.. మరిన్ని గ్రామాలకు నోటిఫికేషన్

అమరావతి అభివృద్ధి పనులకు భూముల అవసరం పెరగడంతో ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Land Acquisition | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి (Amaravathi)లో అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేసింది.

ఇప్పటికే భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతిలో పెద్దఎత్తున భూములు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు అవసరమైన చోట భూసేకరణ విధానాన్ని కూడా అనుసరిస్తోంది.ఇటీవలే 22 గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వం, తాజాగా మరో 12 గ్రామాల్లో 36.042 ఎకరాల భూమికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఇంజినీరింగ్ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భూములు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.

Amaravati Land Acquisition | భూ సమీకరణకు స్పందన తగ్గడంతో మారిన వ్యూహం

ప్రారంభంలో ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలోనే భూములను సేకరించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చి, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రణాళిక ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) విధానానికి మొగ్గు చూపింది. ప్రత్యేకంగా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో భూసేకరణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు రైతులతో అధికారులు చర్చలు జరిపినప్పటికీ, పూర్తి స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం నేరుగా భూసేకరణకు దిగింది.

Amaravati Land Acquisition | అమరావతి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి

అమరావతి అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల మంత్రి నారాయణ భూ సమీకరణ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) కూడా రెండు రోజుల క్రితం అమరావతి ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.రెండో విడతలో దాదాపు 16 వేల ఎకరాల భూమిని సేకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనితో అమరావతి ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను కఠినంగా అమలు చేస్తోంది. అయితే రైతుల సహకారం ఎంతవరకు లభిస్తుందన్నదే ఈ ప్రాజెక్టుల భవిష్యత్తును నిర్ణయించనుంది.

ఇది కూడా చదవండి..: Anakapalle Bus Accident | నక్కపల్లి సమీపంలో బస్సు బోల్తా.. త‌ప్పిన పెను ప్ర‌మాదం, 20 మందికి గాయాలు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....