Samantha Viral Post | ఖర్మ అనుభవించక తప్పదు.. సమంతపై రాజ్​ మొదటి భార్య ఎమోషనల్​ పోస్ట్​!

Naresh Chandan
Samantha Viral Post

Samantha Viral Post | మనిషి జీవితం ఎన్నో అనుబంధాల జాలం. ప్రతి సంబంధం ఒక నమ్మకం, ప్రతి నమ్మకం ఒక హృదయం. కానీ కొన్ని సందర్భాల్లో, ఆ నమ్మకాలు విచ్ఛిన్నం అవుతాయి… మిగిలేది గుండెల్లో నిశ్శబ్ద కేక మాత్రమే.

ఆమె ఒకప్పుడు తన ప్రపంచాన్ని ఒక కుటుంబంగా ఊహించింది. తన సంతోషాలను, తన కలలను ఒకరి చేతిలో ఉంచింది. కానీ కాలం తన మార్గంలో నడుస్తూ, అనుకోని మలుపులు తిరిగింది. ఒకరోజు ఆమెకు తెలిసింది—తన స్థానం ఇంకెవరితోనో భర్తీ అయిందని.

Samantha Viral Post | తండ్రి ప్రేమకు బిడ్డ దూరం

ఖర్మలు ఉన్నాయా.. అవతలివాళ్ల ఏడుపు తగులుతుందా.. అంటే సమాధానం లేదు. కానీ, విషయానికి వస్తే.. ప్రముఖ నటి సమంత గతంలో నాగ చైతన్యతో పెళ్లి.. విడాకులు అయ్యాయి. తర్వాత వివాహం అయి కూతురు ఉన్న రాజ్ నిడుమోరు తో డేటింగ్​కు వెళ్లడం, అతని పెళ్ళానికి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిన విషయమే.

ఇవన్నీ అసాధారణ నిర్ణయాలు. తన సంతోషం కోసం ఒక ఆడదాని సౌభాగ్యాన్ని తీసుకోవడం తండ్రి ప్రేమకు బిడ్డను దూరం చెయ్యడం అనాలోచిత చర్యలుగా పేర్కొనవచ్చు.

Samantha Viral Post | అనుభవించడం పక్కా

ఇక విషయానికి వస్తే.. సమంత పెళ్లి చేసుకున్నాక మొదటి పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. కాగా, దీనికి ప్రతిగా రాజ్ నిడుమోరు మొదటి భార్య శ్యామిలి సోషల్​ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే..

నువ్వు చేసిన ఖర్మ నిన్ను వదిలిపెట్టదు.. అది తిరిగి నీకే వస్తుంది. నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నవాచ్చు. రేపు ఖర్మ అనుభవిస్తే తెలుస్తుంది.. ఎప్పుడనేది చెప్పలేను.. అనుభవించడం పక్కా.. అని పోస్ట్ సారాంశం. అయితే, దీనిని చూసిన నెటిజన్లు.. సమంతను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు.

జీవితంలో కొందరి నిర్ణయాలు, మరొకరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒకరి ఆనందం కోసం తీసుకున్న అడుగు.. ఇంకొకరి ప్రపంచాన్ని శూన్యంగా మార్చొచ్చు. ఈ పరిస్థితుల్లో ‘ఖర్మ’ అనే భావన మనసులో తచ్చాడుతుంది. చేసిన పనుల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు తిరిగి తగులుతుందని బాధలో ఉన్నవారికి ఒక ఆత్మస్థైర్యంగా మారుతుంది.

Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *