అక్షరటుడే, వెబ్డెస్క్: Chandrababu Naidu Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ Andhra pradeshప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ 2027 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
Chandrababu Naidu Tirumala | ఏర్పాట్లను పర్యవేక్షించిన భానుప్రకాశ్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవారిని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి పర్యవేక్షించారు. సీఎం వెంట ఉంటూ దర్శనం చేయించారు. శ్రీవారి కృప, ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.