Bhu Bharati | భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bhu Bharati | భూ భారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్​లో బుధవారం ఆయన అన్ని మండలాల తహశీల్దార్లతో భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు.

ఒక్కో మండలం వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఎన్ని అని ఆరా తీస్తూ, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను కలెక్టర్​ (Collector Bhavesh Mishra) తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని గడువు విధించారు. జూలై 31లోపు వచ్చిన అర్జీలలో ఏ ఒక్కటి కూడా పెండింగ్ లో ఉండకూడదని అన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Bhu Bharati | అర్హులకు న్యాయం చేయాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని భవేష్​ మిశ్రా సూచించారు. సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రికరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం, తిరస్కరణ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అర్హత కలిగిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

Bhu Bharati | ఇసుక అందుబాటులో ఉంచాలి

ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని, ఇసుక కేటాయింపులో అక్రమాలకు తావు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులను క్షేత్రస్థాయిలో సంప్రదించి, వారికి నిర్ణీత ధరకే ఇసుక కేటాయింపులు జరుగుతున్నాయా, లేదా అని ఆరా తీయాలన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని, అర్హులైన వారికి లాటరీ విధానం ద్వారా ఇళ్ళను కేటాయించాలని అన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్​వో గీత, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: DJ Ban Nizamabad | డీజేలకు అనుమతి లేదు : సీపీ సాయి చైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *