Heavy Rain Alert | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో నేటి రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rain Alert | రాష్ట్రంలో నేటి రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్​ ఉందన్నారు.

రాష్ట్రంలో ఇటీవల అల్ప పీడన ప్రభావంతో వర్షాలు పడ్డాయి. అయితే మూడు రోజులుగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నేటి రాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటిపూట తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం, రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. రాత్రి వేళ వాతావరణంలో మార్పులు చొటుచేసుకొని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.

Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్​

ఉమ్మడి నిజామాబాద్​, మెదక్​, హైదరాబాద్​, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్​, నల్గొండ, మహబూబ్​నగర్​ జిల్లాలతో పాటు సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయి. బలమైన గాలులు వీస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: Dharani Irregularities SIT | ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు : సీఎం రేవంత్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *