Bhu Bharati Reforms | భూ భారతితో సంస్కరణలు తెచ్చాం : సీఎం రేవంత్​ రెడ్డి

‘భూ భారతి’ చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhu Bharati Reforms | రైతుకు భూమితోనే భుక్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ‘భూ భారతి’ చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.

తెలంగాణ (Telangana) భారత్​లో అంతర్భాగం అయిన సందర్భంగా.. సెప్టెంబర్​ 17న ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం పేరిట నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్​ 17న వచ్చిందన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధించిందని సీఎం చెప్పారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకుందన్నారు. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణిచివేత తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు.

Bhu Bharati Reforms | ప్రజల తిరుగుబాటుతో..

రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి-భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరిగిందన్నారు. దీంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టడంతో ఏడో నిజాం లొంగిపోయారని చెప్పారు. అది రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం అని వర్ణించారు. అందుకే సెప్టెంబర్ 17ను “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.

Bhu Bharati Reforms | ప్రపంచంతో పోటీ

తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు… ప్రపంచంతో పోటీ పడుతోందని సీఎం అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరిందని ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం అన్నారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా… ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *