తెలంగాణTelangana Heatwave | భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

Telangana Heatwave | భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

రాష్ట్రంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Heatwave | రాష్ట్రంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్పా బయటకు వెళ్లడం లేదు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి.

Telangana Heatwave | సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో నిన్న నిర్మల్​ జిల్లా (Nirmal District)లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ 45.9, ఆదిలాబాద్​ 45.6, కామారెడ్డి 45.5, జగిత్యాల 45.5, సిద్దిపేట 45.2, కుమురం భీమ్​ 45.1, నల్గొండ 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మిగతా జిల్లాలోనూ 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Telangana Heatwave | వడగాలులతో ఇబ్బందులు

ఉత్తర, తూర్పు తెలంగాణలో వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఉష్ణోగ్రతలు 45.5°C కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా అంతర్గత ప్రాంతాల్లో వేడి పొడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Telangana Heatwave | హైదరాబాద్​లోనూ..

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఉష్ణోగ్రతలు నేడు సుమారు 42–43°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఇవి 44°C మార్కును దాటే ఛాన్స్​ ఉంది. మధ్యాహ్న సమయంలో వేడి తీవ్రత అధికంగా ఉంది.

వర్షపాత సూచన..

దక్షిణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నల్గొండ, నాగర్​కర్నూల్​ జిల్లా (Nagarkurnool District)ల్లో సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. అలాగే హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..: మాజీ మంత్రి హరీశ్​ రావు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....