అక్షరటుడే, వెబ్డెస్క్: Graduates MLC Voter Registration | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 2027 మార్చిలో ఖాళీ కానున్నాయి. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం–18లో దరఖాస్తు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలి. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల కాపీలను సమర్పించాలి.
Graduates MLC Voter Registration | ఆన్లైన్లో సైతం..
ఆన్లైన్లో CEO తెలంగాణ వెబ్సైట్, సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఫారం-18తో అవసరమైన ధృవపత్రాలను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 28న ఓటర్ల జాబితా ప్రక్రియపై ఎన్నికల సంఘం నోటీసు విడుదల చేయనుంది. ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6వరకు గడువు ఉంది. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేస్తారు.నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు – అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 25 వరకు వాటిని పరిష్కరించి డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Defamation Case | క్షుద్ర పూజల ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసిన హరీశ్ రావు