Harish Rao Defamation Case | క్షుద్ర పూజల ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసిన హరీశ్ రావు

చేతబడులు , క్షుద్ర పూజలంటూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ నాయకులపై లీగల్ యాక్షన్‌కు దిగారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Defamation Case | చేతబడులు , క్షుద్ర పూజలంటూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ నాయకులపై లీగల్ యాక్షన్‌కు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ పరువు నష్టం (Defamation) పిటిషన్ దాఖలు చేశారు. తన రాజకీయ ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు ఈ అసత్య ప్రచారానికి తెరలేపారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao Defamation Case | కేసు నేపథ్యం..

తెలంగాణలో వర్షాలు కురవకుండా అడ్డుకునేందుకు హరీశ్ రావు పలు ఆలయాలను సందర్శించి క్షుద్ర పూజలు చేయించారంటూ కాంగ్రెస్ నేతలు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను హరీశ్ రావు మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా తన భక్తిభావాన్ని సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గతంలోనే లీగల్ నోటీసులు పంపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిన ఆయన, తాజాగా కోర్టు మెట్లెక్కి పరువు నష్టం దావా వేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి:  Telangana Praja Palana Day | రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి : మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *