అక్షరటుడే, వెబ్‌డెస్క్: Narsingi Underpass Opening | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నార్సింగి, పుప్పలగూడ మార్గంలో మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద కొత్త అండర్ పాస్‌ను సైబరాబాద్ పోలీసులు గురువారం ప్రారంభించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తీరనున్నాయి.
మై హోమ్ అవతార్ జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్సిటికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతాయి. నూతన అండర్‌పాస్ అందుబాటులోకి రావడంతో జంక్షన్ వద్ద యూ టర్న్ చేయడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది. దీంతో నానక్‌రామ్ గూడ, క్రిన్స్ విల్లాస్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే వాహనదారులు జంక్షన్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
Narsingi Underpass Opening | ప్రయాణ సమయం ఆదా
ఈ అండర్‌పాస్‌తో జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. నూతన సదుపాయం అందుబాటులోకి రావడంపై స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Keesara Police Bribery | స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై