అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామంతో రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా బయటపడ్డాయని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్.. అదే పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారని గుర్తుచేశారు. ప్రజాతీర్పు పవిత్రతను కాపాడాల్సిన స్పీకర్ వ్యవస్థ ఆయనకు రక్షణగా నిలవడం దురదృష్టకరమని, హైకోర్టు జోక్యంతో స్పీకర్ నిర్ణయంపై తీవ్ర రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తాయని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ తక్షణమే రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Harish Rao Danam Nagender | హరీష్ రావు సవాల్..
దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రసంగాలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi ) హరీష్ రావు ఈ సందర్భంగా నిలదీశారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో 10వ షెడ్యూల్‌ను సవరించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేటప్పుడు ఆ రాజ్యాంగ నిబద్ధత ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నిజమైన గౌరవమే ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాజీనామాలు చేయించి, మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజా తీర్పు కోరాలని సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాజ్యాంగ నిబద్ధతను మారుస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: Danam Nagender Disqualification | దానం నాగేందర్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. అనర్హత వేటు వేస్తూ తీర్పు