Trump Tariffs | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్​కు షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం చేశారు. దీంతో అది చట్టరూపం దాల్చింది. ఫలితంగా రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు ట్రంప్​కు మార్గం సుగుమమైంది.

రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభ ఈ ఆంక్షల బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించిన ఆమోదించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం ట్రంప్‌కు కల్పించింది.

Trump Tariffs | 500 శాతం టారిఫ్​లు

ఈ చట్టం రష్యా వస్తువులపై 500 శాతం వరకు టారిఫ్​లు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల వస్తువులపై 100 శాతం వరకు సుంకాలను విధిస్తుంది. ప్రస్తుతం రష్యా నుంచి చైనాతో పాటు భారత్​ పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు దేశాలపై ట్రంప్​ 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వీటితోపాటు యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్‌బైజాన్, కజకిస్తాన్, హంగేరి, కిర్గిజ్‌స్థాన్ మరియు స్లోవేకియా అనే 10 దేశాలను స్పష్టంగా పేర్కొనాలని కోరారు. అయితే ఈ చట్టం నేరుగా వంద శాతం సుంకాన్ని విధించదు. ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటే సుంకాలు విధించవచ్చు. కాగా ఇప్పటికే అమెరికా భారత్​పై 10 శాతం టారిఫ్​లు విధిస్తోంది.

ఇది కూడా చదవండి..: Pakistan Mosque Blast | పాకిస్తాన్‌లో ఘోర బాంబు దాడి..మసీదులో ఆత్మాహుతి పేలుడు..15 మంది దుర్మరణం..56 మందికి తీవ్ర గాయాలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *