PM Modi Carbon Emissions | కార్బన్​ ఉద్గారాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ ది ఫ్యూచర్​ ఆప్​ ఎన్విరాన్​మెంట్, క్లైమెట్​ డైనమిక్స్​ సదస్సులో పాల్గొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi Carbon Emissions | ప్రధాని నరేంద్ర మోదీ ది ఫ్యూచర్​ ఆప్​ ఎన్విరాన్​మెంట్, క్లైమెట్​ డైనమిక్స్​ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్బన్ ఉద్గారాల బాధ్యతను తరచుగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై అన్యాయంగా మోపుతున్నారని పేర్కొన్నాఉ.

భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయని మోదీ (PM Modi) తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో తలసరి కార్బన్ ఉద్గారాలు భారతదేశం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ వేదికలపై బలంగా వినిపిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనం కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ఎన్‌జీటీ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.

PM Modi Carbon Emissions | ప్రపంచానికి దిశానిర్దేశం

శతాబ్దాలుగా ప్రకృతి, పర్యావరణానికి సంబంధించిన విషయాలలో భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసిందని మోదీ అన్నారు. తన సాంస్కృతిక అనుభవాల నుండి స్ఫూర్తి పొంది, భారతదేశం ఇప్పుడు ఆధునిక వాతావరణ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తూనే, ఏకకాలంలో సామూహిక ప్రపంచ చర్య కోసం పిలుపునిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి..: IIT Bombay Student | బాంబే ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *