అక్షరటుడే, వెబ్డెస్క్ :Tirumala Brahmotsavam | తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు భక్తులకు దర్శనం ఇచ్చారు.
మలయప్ప స్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందుగా నడుస్తుండగా స్వామివారు మాఢవీధుల్లో విహరించారు.
Tirumala Brahmotsavam | ఆకట్టుకున్న కళాకారులు
మోహినీ అవతార సేవలో 502 మంది కళాకారులు చేసిన జానపద, శాస్త్రీయ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్యాలరీ ఏర్పాట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Chilakaluripet Fire Accident | క్రాకర్స్ షాపులో మంటలు.. యజమాని మృతి