Asian Games | ఆసియా క్రీడలు.. షూటింగ్​లో భారత్​కు రెండు రజతాలు

ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలు సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asian Games | జపాన్​లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. టీమ్​ ఈవెంట్​లో సైతం సిల్వర్​ దక్కించుకుంది.

ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన జట్టు 10 ఎయిర్​ రైఫిల్​ టీం ఈవెంట్​లో సిల్వర్​ సాధించింది. చైనా బంగారు పతకం గెలుచుకుంది. అనంతరం జరిగిన వ్యక్తిగత విభాగం పోటీల్లో ఎలావెనిల్​ వలరివన్​ రజతం గెలిచింది. దీంతో భారత్​ షూటింగ్​ రెండు పతకాలతో ఆసియా గేమ్స్​లో శుభారంభం చేసింది.

Asian Games | హాకీలో విజయం

భారత్ మహిళల హాకీ జట్టు ఉజ్బెకిస్తాన్‌ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది. వుషులో సూరజ్ సింగ్ కాంస్య పతకం కోసం జరిగిన ప్లేఆఫ్‌లలో రెండుసార్లు ఓడిపోయి వెనుదిరిగాడు. మహిళల క్రికెట్ జట్టు సెమీ-ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టేబుల్ టెన్నిస్​లో మహిళల టీమ్ ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించింది. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ మహిళల 60 కేజీల విభాగంలో భారత ప్లేయర్​ సుచిక తరియల్​ సెమీస్​కు చేరింది. దీంతో ఆమెకు పతకం ఖాయం అయింది. షూటింగ్​లో పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అభినందించారు.

దీనిని కూడా చదవండి : Punjab Encounter | పంజాబ్​ పోలీసు హత్య కేసు.. నిందితుడి ఎన్​కౌంటర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *