అక్షరటుడే, కమ్మర్‌పల్లి: Nizamabad Softball Champions | రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచింది. కమ్మర్‌పల్లి(Kammarpally) మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించిన 11వ తెలంగాణ (Telangana Softball) రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది.
Nizamabad Softball Champions | అద్భుత ప్రతిభ
ఫైనల్ పోరులో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు అద్భుత ప్రతిభ కనబర్చి మహబూబ్‌నగర్ జిల్లా బాలికల జట్టుపై 9–3 తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మర్‌పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ హాజరయ్యారు. ఆమె విజేత నిజామాబాద్ జట్టుతో పాటు పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. గెలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ, ఓటమి చెందిన జట్లు నిరాశ చెందకుండా వచ్చే ఏడాది విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కమ్మర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య హాజరై మాట్లాడుతూ.. జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు 5 రోజులపాటు కమ్మర్‌పల్లి మినీ స్టేడియంలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Nizamabad Softball Champions | మ్యాచ్‌ల వివరాలివే..
ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు మహబూబ్‌నగర్ జిల్లా బాలికల జట్టుపై 9–3 తేడాతో విజయం సాధించి రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ జిల్లా జట్టు నల్గొండ జిల్లా జట్టుపై 5-0 తేడాతో విజయం సాధించింది. రాష్ట్ర బెస్ట్ పిచ్ఛర్గా ఈర్నాల వర్షిణి (సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం నిజామాబాద్) ప్రత్యేక బహుమతిని అందుకుంది. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే. శోభన్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్ గౌడ్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు టి. విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.మల్లేష్ గౌడ్, కమ్మర్‌పల్లి ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్. గంగాధర్, సుంకేట రవి, కొత్తపల్లి సాగర్, రాహుల్, చిప్ప నవీన్, కోచ్‌లు అనికేత్, నరేష్, మౌనిక, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: MGMలో ఊడిపడ్డ పెచ్చులు ముగ్గురికి గాయాలు..