Sep 21 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 21 Market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్(Crude oil) ధర దిగివస్తుండడం మార్కెట్లకు ఉపశమనాన్ని ఇస్తోంది. దీంతో అమెరికా ఫ్యూచర్స్ లాభాలతో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు(Asian markets) సైతం పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.

Sep 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.39 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.25 శాతం లాభంతో ఉంది.

Sep 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.51 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.63 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ ఫ్లాట్‌గా ముగిసింది.

Sep 21 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.49 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.36 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.83 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.55 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.53 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.30 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.09 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TB Reward Cash | TB రివార్డ్ నగదు ఎక్కడ?..వరుసగా మూడు జాతీయ అవార్డులు.. రూ.10 లక్షల రివార్డు..ఎక్కడికి వెళ్లిందంటూ ఉద్యోగుల ప్రశ్నలు

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏడు సెషన్ý తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 599.54 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా 28 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,019.69 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 95.88 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.25 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5 శాతం వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.75 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.99 నుంచి 1.06 కు పెరిగింది.
  • విక్స్ 7.36 శాతం తగ్గి 11.38 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *