Telangana Heavy Rains | అల్ప పీడనం ఎఫెక్ట్​.. 23 నుంచి భారీ వర్షాలు

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. అల్పపీడనం ఈ నెల 23న శ్రీకాకుళం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు నీరందక ఎండుతున్న తరుణంలో వరుణుడు కరుణించాడని ఆనంద పడుతున్నారు. అయితే ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి. ఈ క్రమంలో అల్ప పీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

Telangana Heavy Rains | మూడు రోజుల పాటు..

అల్ప పీడనం ప్రభావంతో ఈ నెల 23 నుంచి 25 వరకు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. మధ్య, దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్​ ఉంది. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయి. సెప్టెంబర్ 25/26 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతాయి.

Telangana Heavy Rains | నేడు పలు జిల్లాల్లో..

తెలంగాణలో సోమవారం మధ్యాహ్నం వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. సాయంత్రం వేళ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాత్రివేళ నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వాన పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: TB Reward Cash | TB రివార్డ్ నగదు ఎక్కడ?..వరుసగా మూడు జాతీయ అవార్డులు.. రూ.10 లక్షల రివార్డు..ఎక్కడికి వెళ్లిందంటూ ఉద్యోగుల ప్రశ్నలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *