అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Welfare Schemes | బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం అప్లికేషన్ ప్రక్రియ, పథకం అమలుపై ఆరా తీశారు.
కుట్టు మిషన్ల పథకానికి ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అర్హులకు పథకం ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, బీసీ హాస్టళ్ల (BC Hostels) పనితీరుపై సమీక్షించారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు స్టడీ సర్కిల్ ద్వారా నైపుణ్యాభివృద్ధితో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.
BC Welfare Schemes | గురుకులాలకు సొంత భవనాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మిగిలిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. సొంత భవనాల నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇప్పటికే స్థలం ఉన్న బడులకు భవనాలు నిర్మించాలన్నారు. దీనికోసం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Illegal Sand Mining | ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సీఎస్ సంజయ్ జాజు