అక్షరటుడే,నిజామాబాద్క్రైం: Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా(Nizamabad) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.
Gold Jewellery Murder Case | నవీపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
నవీపేట్(Navipet) మండలానికి చెందిన ఆకుల అనంత అలియాస్ సోనీకి (29) నిందితుడు కుమురం అలియాస్ పాండవాల సాగర్ దూరపు చుట్టం. అయితే ఆమె మెడలో బంగారు ఆభరణాలు చూసిన కుమురం వాటిని ఎలాగైనా చోరీ చేయాలని భావించాడు. ఈ క్రమంలో 2025 నవంబర్ 25వ తేదీన సోనీ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన నిందితుడు సోని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు.
కేసు నమోదు చేసుకున్ని నవీపేట్ పోలీసులు విచారణ చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. విచారించిన కోర్టు నిందితుడు కొమురంనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరో రూ.5వేలు జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆర్నెళ్లు శిక్ష అనుభవించాలని పేర్కొంది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడే విధంగా బలమైన కేసును కోర్టు ముందు నిలబెట్టిన నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్‌ను, ఎఫ్ఐఆర్ చేసి కేసును దర్యాప్తు చేసిన నవీపేట్ ఎస్సై తిరుపతిని సీపీ సాయిచైతన్య అభినందించారు.
ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు