అక్షరటుడే, డిచ్‌పల్లి: Ghanpur Railway Gate | మండలంలోని ఘన్‌పూర్ సమీపంలోని ఎల్‌సీ గేట్ నంబర్ 196ను తాత్కాలికంగా మూసివేశారు. రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా చర్యలు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు అనుమతించడం లేదు.
Ghanpur Railway Gate | రెండు రోజుల పాటు..
ఎల్‌సీ గేట్ నంబర్ 196(కిలోమీటర్ 473/700-800) వద్ద గేట్ లాడ్జి తరలింపు, డబుల్ లైన్ ఏర్పాటుతో పాటు ట్రాక్ లింకింగ్ పనులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు సుమారు రెండు రోజుల పాటు గేట్‌ను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో ఘన్‌పూర్ నుంచి డిచ్‌పల్లి (Dichpally) స్టేషన్ రోడ్డు వైపు ఎల్‌సీ గేట్ మీదుగా రహదారి రాకపోకలకు అనుమతి ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా ముద్‌ఖేడ్– మేడ్చల్ మార్గంలో వంతెనలు, ఆర్‌యూబీలు, విద్యుదీకరణ, సిగ్నలింగ్ తదితర పనులు కొనసాగుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Social Welfare Student Incident | సోషల్ వెల్ఫేర్‌లో విద్యార్థిని ఘటనపై సర్వత్రా విమర్శలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం