India vs Japan  | ఉత్కంఠ పోరులో భారత్​ విజయం

జపాన్​తో జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs Japan | జపాన్​తో జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం సాధించింది. వెట్ అవుట్​ ఫీల్డ్​ కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్​లో 2 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది.

జపాన్​తో జరిగిన మ్యాచ్​ను వర్షం కారణంగా ఐదు ఓవర్లకు కుదించారు. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ అభిషేక్​ శర్మ (Abhishek Sharma) డక్​ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్​ 9 పరుగులు, ఇషాన్​ కిషన్​ 3 పరుగులకే వెనుతిరిగారు. కెప్టెన్​ శ్రేయాస్​ అయ్యార్​ 16 పరుగులు చేశాడు. దీంతో భారత్​ 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది.

India vs Japan  | అక్షర్​ పటేల్ మాయాజాలం

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్​ స్కోర్​ను చేధించేలా కనిపించింది. అయితే అక్షర్​ పటేల్​ మాయాజాలం చేశాడు.   తొలి ఓవర్​లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్​ రన్​ అవుట్​ రూపంలో భారత్​కు వికెట్ దక్కింది. వాషింగ్టన్​ సుందర్​ 2 ఓవర్లు వేసి 13 పరుగులు ఇయ్యడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్​లో జపాన్​ గెలుపు కోసం 8 పరుగులు అవసరం అయిన సమయంలో అక్షర్​ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్​కు విజయం అందించాడు. ఆఖరి ఔవర్​లో కేవలం 5 పరుగులు ఇవ్వడంతో భారత్​ రెండు పరుగుల తేడాతో గెలిచింది.

ఇది కూడా చదవండి..: India Women Gold Medal | ఆసియా గేమ్స్​ ఫైనల్​లో ఘన విజయం.. భారత్​ ఖాతాలో తొలి పసిడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *