అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | గ్లోబల్ మార్కెట్లనుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తొలి గంటలోనే ఒత్తిడికి గురయ్యింది.
జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో నాలుగు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..
దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 137 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 615 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 35 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 204 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 74,529 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23,329 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,174 కంపెనీలు లాభపడగా 2,189 స్టాక్స్ నష్టపోయాయి. 218 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 176 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 100 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers: బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 1.94 శాతం, ఇండిగో 1.58 శాతం, టైటాన్ 0.72 శాతం, టాటా స్టీల్ 0.60 శాతం, ఎన్టీపీసీ 0.15 శాతం లాభపడ్డాయి.
Top Losers: బజాజ్ ఫిన్‌సర్వ్ 1.62 శాతం, ట్రెంట్ 1.47 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.46 శాతం, సన్‌ఫార్మా 1.28 శాతం, టీసీఎస్ 1.13 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Sensex Nifty Losses | నష్టాల్లో ప్రధాన సూచీలు