Telangana New Pensions | కొత్త పింఛన్ల పంపిణీకి సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana New Pensions | తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే దసరా పండుగకు ముందే లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల అమలు ప్రక్రియ వేగవంతమైంది.

Telangana New Pensions | స్పష్టమైన ఆదేశాలు..

ఈ అంశంపై రాష్ట్ర మంత్రి సీతక్క  ( Seethakka ) ప్రత్యేక దృష్టి సారించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. దసరా పండుగ సమయానికి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో, పండుగకు ముందే కొత్త పెన్షన్లు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూసే బాధ్యతను సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్‌కు అప్పగిస్తూ తగు ఆదేశాలు జారీ చేశారు.

Telangana New Pensions | అర్హులకు పెద్దపీఠ..

దరఖాస్తు చేసుకున్న వారిలో పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పథకం కింద ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క నిజమైన అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాంగం దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీని విజయవంతం చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛను అందేలా చూడడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *