ACB Raids | రవాణా కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. ఏజెంట్ల దగ్గర నగదు స్వాధీనం

బండ్లగూడలో ఉన్న దక్షిణ జోన్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బండ్లగూడలో ఉన్న దక్షిణ జోన్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు అక్రమాలను వారు గుర్తించారు.

ఏసీబీ తనిఖీల సందర్భంగా ఆర్టీవో కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ఫోన్లలో అనుమానాస్పద UPI లావాదేవీలు గమనించారు. పలువురు ఏజెంట్లు కార్యాలయంలో ఉన్నారు. కార్యాలయంలోని సిబ్బంది సునీత, మహ్మద్ ఇమ్రాన్, ​ కె. బాబుజీ, హేమంత్ కుమార్, కె. సాయి కుమార్, ఎంఏ లతీఫ్ ఖాన్, టి.సాయికాంత్ ఏజెంట్ల ద్వారా దరఖాస్తులను వేగంగా పంపించడం కోసం దరఖాస్తులపై గుర్తులు, పేర్లను పెడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కార్యాలయంలో ఉన్న ఏజెంట్ల వద్ద రూ. 24,760 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయంలో లతీఫ్​ ఖాన్​ దాదాపుగా 20 ఏళ్లుగా పని చేస్తుండటం గమనార్హం.

ACB Raids | ఏసీబీ దూకుడు

ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు ప్రజల ఫిర్యాదలు మేరకు లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు. మరోవైపు అక్రమాస్తులు కూడబెట్టిన వారిపై కేసులు నమోదు చేసి సోదాలు చేపడుతున్నారు. అంతేగాకుండా అవినీతి ఎక్కువ జరిగే కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అయినా కూడా లంచాలు తీసుకునే అధికారులు మాత్రం మారడం లేదు. ఏసీబీ దాడులు, కేసుల తర్వాత కఠిన చర్యలు లేకపోవడంతోనే అవినీతి అధికారులు భయపడటం లేదని తెలుస్తోంది.

దీనిని కూడా చదవండి : ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్​ డాక్టర్​ అక్రమాస్తులు చూస్తే షాక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *