ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్​ డాక్టర్​ అక్రమాస్తులు చూస్తే షాక్​

నిమ్స్​ అడిషనల్​ మెడికల్ సూపరింటెండెంట్​ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids NIMS Doctor | గేటేడ్​ కమ్యూనిటీల్లో రూ.కోట్లు విలువ చేసే ప్లాట్లు, విలాసవంతమైన కార్లు.. నిమ్స్ (NIMS)​ అడిషనల్​ మెడికల్ సూపరింటెండెంట్ అక్రమాస్తులు చూసి ఏసీబీ (ACB) అధికారులే షాక్​ అయ్యారు. ఆయన నివాసాల్లో భారీగా ఆస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు గుర్తించారు.

నిమ్స్​ అడిషనల్​ మెడికల్ సూపరింటెండెంట్​ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఎర్రగడ్డలోని కల్పతరు అపార్ట్​మెంట్​లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన ఏడు చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక 4బీహెచ్​కే (4 BHK) ఫ్లాట్, కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో 2,3 బీహెచ్​కే ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా నరగంలోని ప్రైమ్​ ఏరియా అయని మణికొండ, పేటబషీరాబాద్, కూకట్‌పల్లిలోని ఐదు 2బీహెచ్​కే ఫ్లాట్లు ఉన్నాయి.

ACB Raids NIMS Doctor | నగదు, బ్యాంకు నిల్వలు

నోరి లక్ష్మీ భాస్కర్‌ యాదాద్రి, నందిగామ, షమీర్‌పేటలో నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నం నగరంలో ఒక 800 చదరపు గజాల ఖాళీ స్థలం సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేగాకుండా ఆయన నివాసంలో రూ.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో రూ.41 లక్షలు, పోస్ట్ ఆఫీసులో రూ.12 లక్షల డిపాజిట్లు, ఇతర సంస్థలలో రూ.1,50,000 పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ACB Raids NIMS Doctor | అర్ధకిలోకు పైగా బంగారం

నిందితుడు మ్యూచువల్ ఫండ్లలో రూ. 29.55 లక్షల పెట్టుబడులు పెట్టాడు. అతడి ఇంట్లో 517.8 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. అంతేగాకుండా ఒక జాగ్వార్, ఒక ఆడి, ఒక టాటా నెక్సాన్ వంటి లగ్జరీ కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా కంపెనీలకు చెందిన నాలుగు బైక్​లు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.6.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్​లో వీటి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.

దీనిని కూడా చదవండి : GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *