అక్షరటుడే వెబ్‌డెస్క్: KIGI Cohort 4 | భారతదేశంలో గేమింగ్ అభివృద్ధి రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇన్‌క్యుబేటర్ (KIGI) కీలక నిర్ణయం తీసుకుంది. ‘KIGI కోహోర్ట్ 4’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు క్రాఫ్టన్ ఇండియా వెల్లడించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 2023లో ఏర్పాటైన KIGI.. ఆర్థిక సహాయం, నిపుణుల మార్గదర్శకత్వం, అంతర్జాతీయ వేదికలపై అవకాశాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న టెక్కీలు, స్టూడియోలకు అండగా నిలుస్తోంది.
KIGI Cohort 4 | విస్తరించిన KIGI మద్దతు ..
సాధారణ ఇన్‌క్యుబేటర్ల మాదిరిగా కాకుండా, KIGI కేవలం ప్రారంభ దశ ఆలోచనలకే కాకుండా మరింత అభివృద్ధి చెందిన గేమ్‌లకు కూడా ఈసారి మద్దతు ఇస్తోంది. మొబైల్ గేమ్స్ విషయంలో ఇప్పటికే బీటా లేదా సాఫ్ట్ లాంచ్ దశలో ఉన్న ప్రాజెక్టులకు, అలాగే పీసీ గేమ్స్ (PC Games) విషయంలో కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తున్న లైవ్ స్టీమ్ డెమో ఉన్న టైటిల్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. కొత్త ఆలోచనలు, ప్రారంభ దశలో ఉన్న టీమ్‌లకు ఎప్పట్లాగే ఈ ప్రోగ్రామ్‌లో ప్రాధాన్యత ఉంటుంది.
KIGI Cohort 4 | అంతర్జాతీయ స్థాయికి భారతీయ గేమింగ్..
భారతీయ ( India )డెవలపర్లు అంతర్జాతీయ స్థాయి పోటీ టైటిల్స్‌ను రూపొందించేలా వనరులు, మార్గదర్శకత్వం అందించడమే తమ లక్ష్యమని KIGI ప్రోగ్రామ్ హెడ్ అనుజ్ సహాని తెలిపారు. భారతదేశం గేమింగ్ రంగంలో శక్తివంతమైన వేగాన్ని చూస్తోందని, సృష్టికర్తలకు ప్రతి దశలోనూ మద్దతునివ్వడమే తమ ధ్యేయమని క్రాఫ్టన్ ఇండియా సీఈఓ సీన్ హ్యూనిల్ సోహన్ పేర్కొన్నారు. KIGI మొదటి కోహోర్ట్ ద్వారా వచ్చిన స్టూడియోలు ఇప్పటికే విజయవంతమైన సాఫ్ట్ లాంచ్‌లను సాధించగా, తాజా కోహోర్ట్ ద్వారా మరిన్ని ప్రాజెక్ట్‌లకు చేయూత లభించనుంది.
ఇది కూడా చదవండి: BIS Screen Protectors | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిబంధన