అక్షరటుడే, కమ్మర్పల్లి: Inter Special Admissions | రాష్ట్రవ్యాప్తంగా ఎస్సెస్సీ పూర్తి చేసుకుని ఇంటర్లో చేరని విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. ప్రత్యేక అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Inter Special Admissions | మూడు రోజుల పాటు..
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, సహకార, టీజీ రెసిడెన్షియల్ తదితర జూనియర్ కళాశాలల్లో ఈనెల 24వ తేదీ నుంచి 26వ తేదీ మూడు రోజుల పాటు ప్రత్యేక అడ్మిషన్ నమోదుకు అవకాశం కల్పించారు. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. టీజీబీఐఈ అడ్మిషన్ నిబంధనల ప్రకారం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యాల అభ్యర్థన మేరకు, ప్రవేశానికి ఇదే చివరి అవకాశం అని తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అనుబంధ జూనియర్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశం పొందాలని సూచించడమైనది. కాలేజీల జాబితాను టీజీబీఐఈ (TGBIE) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి..: Ganesh Shobhayatra Kamareddy | డీజేకు నో.. నాసిక్ డోల్కు ఓకే.. హోరెత్తిన గణేష్ శోభాయాత్ర