Soft Tennis India | సాఫ్ట్​ టెన్నిస్​లో భారత్​కు కాంస్య పతకం

సాఫ్ట్​ టెన్నిస్​ పురుషుల సింగిల్స్​లో భారత ఆటగాడు జై మీనా కాంస్య పతకం సాధించాడు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Soft Tennis India | ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. బుధవారం షూటింగ్​లో రెండు పతకాలు, సాఫ్ట్​ టెన్నిస్​లో ఒక పతకం గెలుచుకున్నారు.

జపాన్​లో జరుగుతున్న ఆసియా గేమ్స్​లో బుధవారం జరిగిన సాఫ్ట్​ టెన్నిస్​ పురుషుల సింగిల్స్​లో భారత ఆటగాడు జై మీనా కాంస్య పతకంతో తన పోరు ముగించాడు. ఈ క్రీడలో భారత్‌కు మొట్టమొదటి ఆసియా క్రీడల పతకాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నిలిచాడు. సెమీ ఫైనల్​లో అతడు జపాన్‌కు చెందిన కురొసాల చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు.

Soft Tennis India | ఫైనల్​లో మీరాబాయి చాను

భారత్​ (India) నేడు మరికొన్ని క్రీడాంశాల్లో పాల్గొననుంది. మహిళల కబడ్డీ (భారత్ vs ఇరాన్), మీరాబాయి చాను పాల్గొనే 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్, చైనాతో బ్యాడ్మింటన్ సెమీ-ఫైనల్ పోరు ఉన్నాయి. వీటిలో గెలిస్తే భారత్​కు పతకం ఖాయం కానుంది. ఫైనల్​లో మీరాబాయి చాను గెలిస్తే మరో గోల్డ్​ మెడల్​ ఇండియా ఖాతాలో చేరనుంది. మరోవైపు రోయింగ్​లో బల్‌రాజ్ పన్వార్ మూడవ స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. డబుల్స్​లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ ఫైనల్ చేరారు.

ఇది కూడా చదవండి..: Asian Games Shooting | ఆసియా గేమ్స్​.. షూటింగ్​లో భారత్​కు మరో రెండు పతకాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *