Nani Premier Show | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాని ప్రీమియర్ షో.. సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది పారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nani Premier Show | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది పారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 రాత్రి హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షోను వీక్షించేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని నాని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగమని, ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా ఆస్వాదించడంలోనే నటుడిగా అసలు సిసలు సంతృప్తి దక్కుతుందని నాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి (  Revanth Reddy ), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు తెలంగాణ పోలీసు యంత్రాంగాన్ని ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.

Nani Premier Show | సానుకూల స్పందన..

నాని అభ్యర్థనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో భద్రతాపరమైన మార్గదర్శకాలను కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లాంటి రద్దీ ప్రాంతంలో ప్రీమియర్ షో నిర్వహించడానికి అధికారిక నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున.. శాంతిభద్రతలు, సాధారణ ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తును పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను అంచనా వేసిన తర్వాత పోలీసు బృందం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Soft Tennis India | సాఫ్ట్​ టెన్నిస్​లో భారత్​కు కాంస్య పతకం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *