అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jindal Supreme IPO | స్టీల్ పైపులు, ట్యూబులు, ఇతర స్టీల్ ఉత్పత్తుల తయారీ మరియు సరఫరాలో అగ్రగామి సంస్థలలో ఒకటైన జిందాల్ సుప్రీం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. సెప్టెంబర్ 16 నుంచి 18 వ తేదీ వరకు ఇన్వెస్టర్లనుంచి బిడ్లను స్వీకరించారు. ఈ కంపెనీ ఐపీవో ద్వారా మార్కెట్‌నుంచి రూ. 124.88 కోట్లను సమీకరించింది.
Jindal Supreme IPO | భారీ డిమాండ్..
జిందాల్ సుప్రీం పబ్లిక్ ఇష్యూకు భారీ డిమాండ్ లభించింది. చిన్న ఇష్యూ కావడంతో భారీగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. పూర్తి కోటా 177.03 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. ఇందులో క్యూఐబీ కోటా 126.41 రెట్లు, ఎన్ ఐఐ కోటా 326.18 రెట్లు, రిటైల్ కోటా 141.75 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
Jindal Supreme IPO | ఊరించిన జీఎంపీ..
కంపెనీ ఒక్కో షేరు ధరను గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 93 గా నిర్ణయించింది. చిన్న ఇష్యూ కావడంతో గ్రే మార్కెట్లో మంచి డిమాండ్ కనిపించింది. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో 31 శాతం ప్రీమియంతో ట్రేడ్ అయ్యాయి.
Jindal Supreme IPO | లిస్టింగ్ తర్వాత అప్పర్ సర్క్యూట్ ..
జిందాల్ సుప్రీం కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్ (Stock market)లో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరును రూ. 93 కు విక్రయిచగా.. 29.03 శాతం ప్రీమియంతో రూ. 120 వద్ద లిస్టయ్యాయి. రూ. 126 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అంటే లిస్టింగ్ డే రోజున ఐపీవో ఇన్వెస్టర్లకు 35.48 శాతం లాభాలను అందించింది.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | లాభాల్లో సూచీలు