Hero Motors IPO | హీరో మోటార్స్.. లిస్టింగ్ తర్వాత అదుర్స్..

హీరో మోటార్స్ కంపెనీ ఐపీవో లిస్టింగ్ సమయంలో నిరాశ పరిచినా.. తర్వాత కోలుకుని అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hero Motors IPO | భారత్‌తోపాటు అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని గ్లోబల్ వాహన తయారీ సంస్థలకు పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్‌ను రూపొందించి సరఫరా చేసే ఆటో విడిభాగాలు తయారీ సంస్థ అయిన హీరో మోటార్స్ లిమిటెడ్ ఐపీవోకు వచ్చింది. ఈనెల 16 నుంచి 18 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. ఈ కంపెనీ మార్కెట్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు సమీకరించింది.

Hero Motors IPO | స్పందన అంతంతే..

హీరో మోటార్స్ ఐపీవో (IPO)కు స్పందన నామమాత్రంగా లభించింది. మొత్తం ఇష్యూ 7.01 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 1.59 రెట్లు, ఎన్ ఐఐ కోటా 10.47 రెట్లు, రిటైల్ కోటా 8.62 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Hero Motors IPO | నెగెటివ్‌లో జీఎంపీ..

కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్ లేదు. జీఎంపీ నెగెటివ్‌గా ఉండడంతో ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపలేదు.

Hero Motors IPO | డిస్కౌంట్‌తో లిస్టయినా..

హీరో మోటార్స్ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 84గా నిర్ణయించింది. ఈ కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అయితే ఇష్యూ ప్రైస్‌తో పోల్చితే 2.38 శాతం డిస్కౌంట్‌తో రూ. 82 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. రూ. 80.50 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేశాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ధర పైకి దూసుకెళ్లింది. చివరికి 17.14 శాతం లాభంతో రూ. 98.40 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

ఇది కూడా చదవండి..: Jindal Supreme IPO | అదరగొట్టిన జింల్ సుప్రీం ఐపీవో.. 29 శాతం లాభంతో లిస్టింగ్

 

దా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *