Stock Market Crash | పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు.. పడిపోతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల బాటపట్టింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 706 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 2007 గరిష్టానికి చేరాయి. దీంతో యూఎస్ ఫెడ్ వచ్చే సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సైతం వాటిని అనుసరిస్తూ భారీ నష్టాలతో సాగుతోంది.

Stock Market Crash | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 556 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మొదట్లో 90 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 308 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కోలుకుని 60 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 85 పాయింట్లు క్షీణించింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 706 పాయింట్ల నష్టంతో 74,121 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 23,211 వద్ద ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 4 స్టాక్స్ మాత్రమే లాభాలతో ఎండగా, 26 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 0.37 శాతం, టెక్ మహీంద్రా 0.28 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 4.44 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.09 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 3.79 శాతం, ఇండిగో 1.73 శాతం, కొటక్ బ్యాంక్ 1.50 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: NSE IPO Listing | ఫ్లాట్ గా లిస్టై.. ఐదు శాతం ఎగబాకి…

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *