Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో ఊచకోత.. భారీగా నష్టపోయిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఊచకోతకు గురయ్యింది. సెన్సెక్స్ 1,247 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు నష్టపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పెరుగుతున్న ముడిచమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను అధికం చేస్తున్నాయి. దీంతో అమెరికా ఫెడ్ అధికారులు కఠిన వైఖరిని కొనసాగిస్తూ వచ్చే సమావేవంలో వడ్డీ రేట్లను మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Stock Market Crash | బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ఆందోళన..

అమెరికా బాండ్ల రాబడులు సైతం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 2007 గరిష్టానికి చేరడం ఈక్విటీ ఇన్వెస్టర్లనను ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా బీమా కమీషన్ నిబంధనలలో చేసిన ప్రతిపాదిత మార్పుల కారణంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. మార్కెట్ పతనానికి ఇది కూడా ఒక కారణం.

Stock Market Crash | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ మార్కెట్లు (Domestic markets) గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 556 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మొదట్లో 90 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 799 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కోలుకుని 60 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 235 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,247 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద, నిఫ్టీ 383 పాయింట్ల నష్టంతో 23,063 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,473 కంపెనీలు లాభపడగా 2,884 స్టాక్స్ నష్టపోయాయి. 216 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 147 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 99 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Crash | ఒక్కటి మినహా..

బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 29 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ మాత్రమే ఫ్లాట్‌గా ముగిసింది.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 5.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.67 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.06 శాతం, ఇండిగో 2.78 శాతం, ట్రెంట్ 2.75 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: AU Small Finance Bank | ఆటో మొబిలిటీ రంగంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రికార్డ్.. రూ.50,000 కోట్ల ఏయూఎం మార్క్ క్రాస్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *