అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Weather | రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నారు. అక్కడక్కడ జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు.
వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తాజాగా దాని ప్రభావం తగ్గడంతో వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. పొడి గాలుల పెరిగి, శనివారం నుంచి తెలంగాణ అంతటా వేడి పరిస్థితులు కొనసాగనున్నాయి. తేమ, అధిక వేడి కారణంగా ఒకటి రెండు చోట్ల చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో సహా చాలా ప్రాంతాలు పొడిగా ఉంటాయి.
Telangana Weather | ముగిసిన రుతుపవన వర్షాలు
వర్షాకాలం సీజన్‌కు సంబంధించి రుతుపవన వర్షాలు ముగిశాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడలేదు. తెలంగాణలోని అనేక రిజర్వాయర్లు సగం కూడా నిండలేదు. దీంతో సాగునీటికి రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉంటుంది. పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 34-36 డిగ్రీలు నమోదు అవుతాయి. అక్టోబర్ 3-10 తేదీల మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: AFSPA Extension | సాయుధ దళాల చట్టాన్ని 6 నెలలు పొడిగించిన కేంద్రం