Chakali Ailamma Tribute | బీసీల నిప్పుకణిక చాకలి ఐలమ్మ..

బీసీల నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని.. మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన ధీశాలి అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Chakali Ailamma Tribute | బీసీల నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని.. మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణ (Telangana)కు స్పూర్తినిచ్చిన ధీశాలి అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ పేర్కొన్నారు. వినాయక్​నగర్​లోని హనుమాన్ జంక్షన్ వద్ద మహనీయుల పార్కులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి శనివారం ఘననివాళులు అర్పించారు.

Chakali Ailamma Tribute | బీసీలు మేల్కోవాలి..

బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనమని సుధాకర్​ అన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంకు జన్మనిచ్చిన తల్లి ఐలమ్మ అని అన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చిందన్నారు. ఆరోజు దేశ్​ముఖ్​లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ వీరత్వాన్ని వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపె రవీందర్, అపర్ణ, చంద్రకాంత్, సాయి బసవ, బాలయ్య, శ్రీనివాస్, గంగాధర్, సురేందర్, అనిల్ సత్యనారాయణ, అంకంరావు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: SGF Archery Selections | ఎస్‌జీఎఫ్ ఆర్చరీ జిల్లా స్థాయి సెలక్షన్స్ ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *