అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari Flood | ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం (Badrachalam) వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 17 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయానికి 40 అడుగులు దాటింది. స్నానఘట్టాల వద్ద పలు మెట్లు నీట మునిగాయి. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
Godavari Flood | మేడిగడ్డ వద్ద..
మేడిగడ్డ (Medigadda) బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులకు వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,530 క్యూసెక్కులుగా నమోదు అవుతోంది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా నమోదు అవుతోంది.
Godavari Flood | నిలిచిపోయిన రాకపోకలు
తెలంగాణలోని వాజేడు మండలంలో ఇసుకవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ –ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీలోని పొలవరం జిల్లాలో సీతపల్లివాగు సైతం పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 38 అడుగులకు చేరింది. వరద నీటితో జాతీయ రహదారి-326పై రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సీతానగరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం pic.twitter.com/ZLNFbCc1iX
— chekuriganesh (@chekurigan86501) September 27, 2026
దీనిని కూడా చదవండి : Nalgonda murder case | నల్గొండలో ఒకరి దారుణ హత్య