LPU Student Protest | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసు వాహనాలకు నిప్పు

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPU Student Protest | పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో (LPU Student Protest ) మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాంపస్​ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆదివారం రాత్రి పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో వారిపై దాడి చేయడంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఫగ్వారా-జలంధర్ హైవేను విద్యార్థులు దిగ్బంధించారు. అనంతరం పోలీసులతో ఘర్షణ పడి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మరోసారి క్యాంపస్‌లో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినట్లు సమాచారం. రాళ్ల దాడి, నిప్పు పెట్టే ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు వాహనాలు, ఆస్తులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాల మోహరించారు. నిరసనకు కారణమైనట్లు చెబుతున్న ఘటన ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

LPU Student Protest | వదంతులతోనే..

విద్యార్థుల నిరసనలపై ఎల్​పీయూ డీన్ సోరభ్ లఖన్‌పాల్ మాట్లాడారు. అత్యాచారం ఘటనపై విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినప్పుడు తీవ్రంగా పరిగణించామన్నారు. అయితే అవి పుకార్లని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పినా.. విద్యార్థులు పట్టించుకోలేదన్నారు. క్యాంపస్​లో జరిగిన ఘటన వెనుక సంఘవిద్రోహ శక్తులు ప్రమేయం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Parvesh Verma Slap Video | ఆప్​ ఎమ్మెల్యే పీఏపై చేయి చేసుకున్న మంత్రి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *