అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jeevan Reddy Arvind Remarks | అర్వింద్ (MP Arvind) అంటేనే హాఫ్ నాలెడ్జి వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Jeevan Reddy Arvind Remarks | అహంకారం.. అవినీతికి అంగిలాగు తొడిగితే..
అహంకారం.. అవినీతికి, అబద్దాలకు అంగిలాగు తొడిగితే అది అర్విందేనని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. డీఎస్ పేరు చెప్పుకుని 2004లో కాంగ్రెస్ బీ ఫాంలు అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని పగలు తిడతాడని.. రాత్రి ఆయన పొర్లు దండలు పెడతాడన్నారు. అర్వింద్ ఎంపీగా గెలవడం నిజమాబాద్ జిల్లాకు దురదృష్టకరమని పేర్కొన్నారు. బనకచర్లను జనకచర్ల అని పలికే అర్వింద్‌కు రాష్ట్రంను తీసుకొచ్చిన కేసీఆర్ గురించి మాట్లాడేత అర్హత ఉందా అని ప్రశ్నించారు.
రేవంత్ పేటీఎం బ్యాచ్‌లో అర్వింద్ ఒక సభ్యుడని.. తెలంగాణ ఉద్యమంలో అర్వింద్ పాత్ర అణా పైసా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంకెంత కాలం విషం కక్కుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిందే మొత్తం రూ.84వేల కోట్లు అయితే.. లక్షన్నర కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరిగిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వచ్చి సర్వే చేసుకోవాలని.. 700 ఎకరాలు ఉంటే ఆయనే తీసుకోవాలని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. సొంత సోదరుడిని మోసం చేసి అడుక్కుతినేలా చేసిన దగాకోరు అర్వింద్ అని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు జిల్లాలో ఎలాంటి పనులు చేస్తుందో రైతులకు వివరించాలని ఆయన కోరారు. సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: MRPS Protest in Armoor | సీఎంకు పిండ ప్రదానం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు