అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Oil Crisis | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్‌ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అమెరికాలో వ్యూహాత్మక చమురు నిల్వలు నాలుగు దశాబ్దాల కనిష్టానికి చేరడంతో చమురు సంక్షోభ భయాలు మార్కెట్‌ను వెన్నాడుతున్నాయి. ద్రవ్యోల్బణ భయాలతో అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న ప్రచారానికి తోడు భారత్‌లోనూ భారీగా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి.
Oil Crisis | మళ్లీ నష్టాలతోనే..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 51 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 620 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా మొదట్లో 21 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 184 పాయింట్లు పతనమైంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 264 పాయింట్ల నష్టంతో 72,507 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 22,708 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. అదానీ పోర్ట్స్ 1.11 శాతం, సన్‌ఫార్మా 0.58 శాతం, ఇండిగో 0.47 శాతం, బీఈఎల్ 0.16 శాతం, కొటక్ బ్యాంక్ 0.12 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్సీఎల్ టెక్ 1.66 శాతం, ఇన్ఫోసిస్ 1.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.26 శాతం, టైటాన్ 1.23 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.20 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 29 Gold Prices | పసిడి ప్రియులకు అలెర్ట్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..