RTC Bus Protest | ఆర్టీసీ బస్సులను అడ్డగించిన విద్యార్థులు

ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం, సమయపాలన పాటించకపోవడం పట్ల గ్రామస్తులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Protest | ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం, సమయపాలన పాటించకపోవడం పట్ల గ్రామస్తులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో బస్సు ఆపడం లేదని కామారెడ్డి మండలం (Kamareddy Mandal) రాఘవాపూర్ గ్రామస్తులు బస్సును అడ్డగించి ఆందోళన చేపట్టారు.

RTC Bus Protest | కామారెడ్డి నుంచి రాఘవాపూర్​..

కామారెడ్డి నుంచి రాఘవపూర్ మీదుగా ముత్యంపేట, దోమకొండ పెద్దమల్లారెడ్డికి వెళ్తున్న బస్సులను రాఘవాపూర్ గ్రామంలో ఎందుకు ఆపడం లేదని గ్రామస్తులు నిలదీశారు. ప్రతిరోజూ రాఘవపూర్ స్టేజీ వద్ద బస్సు నిలిపి విద్యార్థులను ఎక్కించుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులు ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపట్టి ఆర్టీసీ బస్టాండ్‌ను ముట్టడిస్తామని విద్యార్థులు, గ్రామస్తులు హెచ్చరించారు. అలాగే పెద్దమల్లారెడ్డి గ్రామంలో సమయానికి బస్సులు రావడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గతంలో సమయానికి బస్సులు వచ్చేవని తెలిపారు. బస్సులు ఆలస్యంగా రావడంతో సమయానికి కళాశాలకు వెళ్లలేకపోతున్నామని, క్లాసులు మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి సమయానుకూలంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Anti Drugs Awareness Video | ఉపాధ్యాయుడి సామాజిక చైతన్యం..”మత్తు కాదు.. మేలుకో!”లఘు చిత్రం రూపకల్పన!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *