అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Gold Medal | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ అథ్లెట్స్ ప్రతిభ కనబరిచారు. మంగళవారం పసిడితో సహా పలు పతకాలు సాధించారు. దీంతో భారత ఖాతాలో మొత్తం 52 పతకాలు చేరాయి.
అథ్లెటిక్స్ విభాగంలో మహిళల 4×400మీ రిలేలో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. విత్య రామరాజ్, కిరణ్, ప్రాచి, పూవమ్మ మచెట్టిరాలతో కూడిన జట్టు 3:29.69 సమయంతో అగ్రస్థానంలో గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 4×400 మీటర్ల రిలే, మిక్స్డ్ 4×100మీ రిలే ఈవెంట్లలో భారత్ కాంస్య పతకాలను గెలిచింది.
India Gold Medal | హైజంప్‌లో..
మహిళల హై జంప్ ఫైనల్లో పూజా సింగ్ (Pooja Singh) మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించింది. గుల్వీర్ సింగ్ పురుషుల 5000మీ ఈవెంట్లో కాంస్యం సాధించారు. అంతకు ముందు ఆయన పురుషుల 1,500మీ, 10,000మీ ఈవెంట్లలో రజత పతకాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం భారత్ 6 గోల్డ్, 21 రజత, 25 కాంస్య పతకాలతో 10వ స్థానంలో ఉంది. పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు.
GOLDEN RELAY FOR BHARAT!
Congratulations to the Indian Women’s 4x400m Relay Team on winning the Gold Medal at the #AsianGames2026.
Speed, strength and teamwork at its finest!#Cheer4Bharat pic.twitter.com/X759tsKuIK
— Kiren Rijiju (@KirenRijiju) September 29, 2026
దీనిని కూడా చదవండి : Bandi Sanjay SIR | కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు.. బండి సంజయ్ సంచలన విమర్శలు