Vietnam Accident | యోగా నేర్పడానికి వెళ్లి.. వియత్నాంలో ఇద్దరు భారతీయుల మృతి

వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vietnam Accident | వియత్నాం (Vietnam)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బైక్​ కారును ఢీకొనడంతో జార్ఖండ్​కు చెందిన రాజా కుమార్ వర్మ (26), వినయ్ యాదవ్ (23) చనిపోయారు.

రాంచీకి చెందిన రాజా కుమార్ వర్మ రెండేళ్లుగా వియత్నాంలో నివసిస్తూ యోగా నేర్పిస్తున్నారు. జంషెడ్‌పూర్‌కు చెందిన వినయ్ యాదవ్ కూడా సుమారు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వియత్నాం వెళ్లారు. యోగా శిక్షకుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 25న యోగా తరగతులు ముగించుకుని వస్తుండగా, వారి బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వర్మ అక్కడికక్కడే మరణించగా, యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల చనిపోయాడు.

Vietnam Accident | మృతదేహాలు తీసుకు రావాలని..

ప్రస్తుతం ఆ ఇద్దరి కుటుంబాలు వారి మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వర్మ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని రాంచీకి తీసుకురావడానికి సుమారు రూ.20 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే ఆర్థిక స్తోమత తమకు లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎంపీ మహువా మాజీని ఆమె నివాసంలో కలిసి, మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. యాదవ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వారి మృతదేహాలను త్వరలోనే జార్ఖండ్‌కు తీసుకువస్తామని కార్మిక శాఖ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Drug Seizure | రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *