Stock Market Volatility | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. చివరికి సెన్సెక్స్ 49 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు నష్టపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Volatility | దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. ఉదయం లాభాల బాటలో సాగుతున్నట్లు కనిపించినా.. ముడి చమురు ధరలు మళ్లీ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు తిరిగి నష్టాల బాటపట్టాయి. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ సుమారు 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయాయి.

Stock Market Volatility | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇంట్రాడేలో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు లాభాల బాటలో పయనించిన ప్రధాన సూచీలు.. లాభాల స్వీకరణతో తిరిగి పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 72,480 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 22,620 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Volatility | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,144 కంపెనీలు లాభపడగా 2,232 స్టాక్స్ నష్టపోయాయి. 234 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 169 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 142 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో, 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కొటక్ బ్యాంక్ 2.86 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.31 శాతం, ఇండిగో 2.05 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.41 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.57 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎటర్నల్ 2.31 శాతం, సన్‌ఫార్మా 2.15 శాతం, టైటాన్ 2.01 శాతం, అదానీ పోర్ట్స్ 1.76 శాతం, టాటా స్టీల్ 1.76 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Oppo K14 Plus | ఆండ్రాయిడ్ 17 ఓఎస్‌తో ఒప్పో ఫోన్ లాంచ్.. అక్టోబర్ 8న సేల్ ప్రారంభం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *